calender_icon.png 28 September, 2024 | 10:48 PM

బొగ్గు నిక్షేపాల కోసం రామప్పకు ఎసరు

27-09-2024 12:27:11 AM

ఎమ్మెల్సీ పోచంపల్లి

హైదరాబాద్, సెప్టెంబర్ 26  (విజయక్రాంతి): రామప్ప దేవాలయం దగ్గర బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రహస్యంగా ప్రయత్నాలు చేస్తోందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో నిర్లక్ష్యమైన రామప్ప దేవాలయం కేసీ ఆర్ హాయంలో 2021లో యునెస్కో గుర్తింపునకు నోచుకుందన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి మీడియాతో మాట్లా డారు. రామప్ప ఆలయం సమీపంలో ఓపెన్ కాస్టింగ్ బొగ్గు గనుల నిక్షేపాలు వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిం చారు.

దీంతో రామప్ప గుడికి పెనుముప్పు వాటిల్లబోతోందని ఆందో ళన వ్యక్తంచేశారు. ఒకవేళ బొగ్గు గని అక్కడ వస్తే రామప్పకు యునెస్కో గుర్తింపు రద్దవుతుందని, ఇది దేశానికే చెడ్డ పేరు తెస్తుందని అన్నారు. ఢిల్లీ సుల్తాన్‌ల కన్నా అధ్వానంగా రేవంత్ సర్కార్ మారుతోందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ  తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులతో రామప్ప ఆనవాళ్లకే ముప్పు వాటిల్లే ప్రమాదముందనని ఆందోళన వ్యక్తం చేశారు.