calender_icon.png 3 October, 2024 | 8:10 AM

గోమూత్రం తాగితేనే మంటపంలోకి..

02-10-2024 01:40:59 AM

ఇండోర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

ఇండోర్, అక్టోబర్ 1: దసరా సందర్భంగా ఏర్పాటుచేసే దుర్గామాత మం టపాల్లోకి ప్రవేశించి పూజలు చేయాలంటే భక్తులంతా ముందుగా గోమూ త్రం తాగాల్సిందేనని బీజేపీ ఇండోర్ జిల్లా అధ్యక్షుడు చింటూ వర్మ డిమాం డ్ చేశారు. నిజమైన హిందువులైతే గోమూత్రం తాగేందుకు అభ్యంతరం ఏముంటుందని ప్రశ్నించారు. గార్బా పండల్స్‌లోకి వెళ్లేందుకు ఆధార్ కార్డు చూపించి వెళ్తే సరిపోదని, ఆ కార్డులను మార్ఫింగ్ చేసే అకాశం ఉందని పేర్కొన్నారు.

‘గార్బా పండల్స్‌లోకి భక్తులను అనుమతించేముందు వారికి గోమూ త్రం ఇవ్వాలని.. దానిని తాగిన వారినే అందులోకి అనుమతించాలని పండ ల్స్ నిర్వాహకులందరికీ విన్నవిస్తు న్నాం. నిజమైన హిందువులైతే గోమూ త్రం తాగటానికి నిరాకరించే అవకాశమే లేదు’ అని పేర్కొన్నారు.  చింటు ప్రకటనపై కాంగ్రెస్ నేత నీలభ్ శుక్ల మండిపడ్డారు.