calender_icon.png 26 December, 2024 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలహాబాద్ హైకోర్టుకు వెళ్లండి

13-07-2024 12:14:27 AM

హథ్రాస్ ఘటనపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

హథ్రాస్, జూలై 12 : ఉత్తరప్రదేశ్‌లో 121 మంది ప్రాణాలు బలిగొన్న హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇలాంటి కేసుల విచారణకు హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది. తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలని కోరగా ఈమేరకు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.