calender_icon.png 7 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీ రేట్ల పెంపుకై జిఓ విడుదల చేయాలి

03-01-2025 12:40:32 AM

కల్వకుర్తి, జనవరి 2: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ, జిసిసి హమాలీల 2024-25 ఎగుమతి, దిగుమతి రేట్ల పెంపుకై రాష్ర్ట ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కల్వకుర్తి సివిల్ సప్లు స్టాక్ పాయింట్ వద్ద హమాలీలు సమ్మెకు దిగారు.  వీరికి మద్దతుగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పరశురాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు సమ్మెలో పాల్గొని మాట్లాడారు.

సమ్మె న్యాయమైనదని వెంటనే జీవో విడుదల చేసి వారికి రావలసిన అన్ని అలవెన్సులు వేతనం ఏరియర్స్ తో సహా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లు హమాలీ యూనియన్ రాష్ర్ట అధ్యక్షులు బాలయ్య,  నాయకులు జంగయ్య, బీరయ్య, యాదయ్య, పర్వతాలు, కృష్ణ, నరేష్, మల్లేష్ తో పాటు కెవిపిఎస్ కల్వకుర్తి మండల నాయకులు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.