01-04-2025 12:44:31 AM
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ (హెచ్‌సీయూ)లో ఫుల్‌బాల్ ఆడేందుకు వెళ్లి.. ఆ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కన్ను వేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆస్తులు అమ్మి అప్పులు తేవడమే సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. హెచ్‌సీయూ భూముల విషయం లో ప్రభుత్వ తీరును కేటీఆర్ తప్పుపట్టారు.
భూముల కోసం పో రాటం చేస్తున్న విద్యార్థులకు అండగా ఉం టామని ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో హెచ్‌సీయూ విద్యార్థులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మా ట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో 45 వేల ఎకరాలు అమ్ముకోబోతున్నప్పుడు.. హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరాలనూ అమ్మడమెందుకని ప్రశ్నించారు. ఈ అంశం పై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
హెచ్‌సీయూ పూర్వవిద్యార్థులైన మంత్రులు శ్రీధర్‌బాబు, భట్టి ఈ అంశంపై స్పందించాలన్నారు. హెచ్‌సీయూలో కాంగ్రెస్ చేస్తోన్న అరాచకం.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కనిపించడం లేదా ప్రశ్నించారు. ముంబయి, ఛత్తీస్‌గఢ్ అడవులపై మాట్లాడే రాహుల్.. హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.