14-04-2025 01:46:21 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఎస్సీ ఉపకులాలకు 15 శాతం రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 8వ తేదీన ఆమోదించారు.ఎస్సీ వర్గీకరణపై నేడు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్సీలోని మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి న్యాయశాఖ కేటాయింపులు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిలో 15 ఉప కూలాలను గుర్తించి గ్రూప్-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కూలాలను గ్రూప్-బీ కింద ఉన్న వారికి 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కూలాలను గ్రూప్-సీ కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి.