calender_icon.png 26 October, 2024 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ప్రపంచంలోకి వెళతారు

26-10-2024 12:00:00 AM

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన పిరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకష్ణ రెడ్డి దీనిని నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. - “నేను చాలా మొండివాడిని. ఇబ్బందులు వచ్చినా మంచి సినిమాలు చేయాలనే నా ప్రయత్నం ఆపను.

కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అన్నవాళ్లతోనే బాగా చేశాడు అనిపించుకుంటా. కంటెంట్ మీద శ్రద్ధ తీసుకుని ‘క’ సినిమా చేశాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా కొత్తగా ప్రయత్నించాం. వాసుదేవ్ ప్రపంచంలోకి వెళ్లి కథకు మీరు బాగా కనెక్ట్ అవుతారు“ అని తెలిపారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ..- “క’ మూవీలో నేను సత్యభామ అనే బ్యూటిఫుల్ రోల్ చేస్తున్నాను. సినిమాలో ఎన్నో ట్విస్టులు, టర్న్‌లు ఉన్నాయి.

అవన్నీ మీకు ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి” అన్నారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ..- “క’  సినిమా ట్రైలర్‌కు నాలుగు రెట్ల పవర్ ఫుల్‌గా ఉంటుంది. కిరణ్‌ని ఇప్పటి దాకా చూడని విధంగా సరికొత్తగా ఈ మూవీలో చూపించబోతున్నాం” అని పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ చింతా గోపాలకష్ణ రెడ్డి మాట్లాడుతూ - “క’ సినిమాను బెటర్ క్వాలిటీతో తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సకుటుంబంగా మీరంతా వచ్చి థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది” అని తెలిపారు.