మాజీమంత్రి పువ్వాడ
ఖమ్మం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ‘మన చేతుల్లో ఎప్పుడూ పింక్ డైరీ ఉండాలి. ఆ డైరీ పట్టుకొనే ప్రజల్లో తిరగాలి. మన డైరీ చూస్తే అధికార పార్టీ వారు భయపడాలి. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి’ అని మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో పార్టీ ఆధ్వర్యంలో రూపొం దించిన డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి అధికార పార్టీపై ఫైరయ్యారు. తాను మం త్రిగా ఉన్నప్పుడు ఖమ్మం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో చెప్పాలన్నారు. ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.
కార్యక ర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి పాలన బా గుందా? ఫామ్‌హౌజ్ పాలన బాగుందా అని కాంగ్రెస్ పెట్టిన పోల్ సర్వేలో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, నాగచంద్రారెడ్డి, కృష్ణ, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయకుమార్ పాల్గొన్నారు.