calender_icon.png 22 January, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఆరోగ్య బీమా

22-01-2025 07:38:32 PM

పటాన్ చెరు: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కోసం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Goodem Mahipal Reddy) అందించిన వ్యక్తిగత ఆరోగ్య భీమా జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచింది. రామచంద్రాపురానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుమారుడు సుమంత్ రాజ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అందించిన ఆరోగ్య భీమా ద్వారా సుమారు రూ.12 లక్షల ఆరోగ్య భద్రత సహాయం అందింది. గత సంవత్సరం క్రితం సైతం ఇదే జర్నలిస్టు కుటుంబ సభ్యులకు సుమారు రూ.6 లక్షల వరకు ఆరోగ్య భీమా పొందారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్ ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అందించిన ఆరోగ్య భీమా ద్వారా తన కుమారుడు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడని జర్నలిస్ట్ ఆనందం వ్యక్తం చేశారు.