calender_icon.png 29 November, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేనోవేషన్ చేసిన పనులను ప్రారంభించిన జి.యం.

29-11-2024 04:59:36 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియా టేకులపల్లి హైటెక్ కాలనీ నందు రేనోవేషన్ చేసిన చిల్డ్రన్స్ పార్క్, సిఇఆర్ క్లబ్, షటిల్ కోర్ట్ లను ఏరియా జియం జాన్ ఆనంద్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఫ్యామిలీ డే వేడుకల సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అదే విధంగా ఉద్యోగుల సంక్షేమానికి అంతే ప్రాధాన్యత ఇస్తుందని, ఇటువంటి వేడుకలు నిర్వహించడం వలన ఉద్యోగులకు, యాజమాన్యం మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని ఎటువంటి భిన్న అభిప్రాయాలు లేకుండా అందరూ ఒక తాటిపై వచ్చి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించుటకు తోడ్పడతాయని తెలిపారు.

అనంతరం ఫ్యామిలీ డే సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల క్రీడలలో గెలుపొందిన ఉద్యోగుల కుటుంబాల మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈనెల 30న ఉద్యోగ విరమణ పొందుతున్న జిఎం జాన్ ఆనంద్ ను సి. ఇ. ఆర్ క్లబ్ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవింద రావు, మేనేజర్ సౌరబ్ సుమన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శివశంకర్, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు రాజారామ్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి  కొంగర వెంకటేశ్వర్లు, ప్రాతినిధ్య సంఘ బ్రాంచ్ కార్యదర్శి భూక్య నాగేశ్వరరావు, సిఇ ఆర్ క్లబ్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.