calender_icon.png 20 January, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి పురోగతి తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం

19-01-2025 09:03:25 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం కార్యాలయం(Singareni Illandu Area GM Office)లో ఆదివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జి.యం కృష్ణయ్య మాట్లాడుతూ... సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని వివిధ గనులు, విభాగాలలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్సౌర్సింగ్ ఉద్యోగులకు, ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ(Singareni Institute) రెగ్యులర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలకు, ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంత ప్రజలకు/వారి పిల్లలకు విదేశీ విద్య అవకాశాలు మరియు వృత్తి పురోగతి తదితర అంశాలపై “చెమట చుక్కలకు తర్పీదు” అనే అవగాహనా కార్యక్రమాన్ని వాల్మీకి గ్రూప్, హైదరాబాద్ వారిచే సింగరేణి సంస్థ అన్ని ఏరియాలలో ఈ నెల 27 నుంచి నిర్వహిస్తారని  ఇల్లందు ఏరియా లో పనిచేసే రెగ్యులర్, ఔట్సౌర్సింగ్ ఉద్యోగులందరూ,  ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంత ప్రజలందరూ తమ పిల్లలని ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి హజారైయ్యేలచూసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇల్లందు ఏరియా లో ఈ కార్యక్రమ నిర్వహణ స్థలం, తేది, సమయం త్వరలో తెలుపుతామన్నారు.