calender_icon.png 14 October, 2024 | 1:52 PM

వెయ్యికిపైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తొలగించిన జీఎం

21-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 20: అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ (జీఎం)  1,000కిపైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఉద్యోగాల్లోకి తొలగించింది. యూఎస్‌లోని మిచ్‌గాన్ కేంద్రంలో అధికంగా 600కిపైగా ఉద్యోగుల లేఆఫ్ చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగాల కోతను జనరల్ మోటార్స్ ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. జీఎం భవిష్యత్ నిర్మాణం కోసం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కార్యకలాపాల్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్నామని తెలి పింది.  కొత్త ఎలక్ట్రిక్ మోడల్ కార్ల బ్యాట రీ మేనేజ్‌మెంట్, డ్రైవింగ్ కేరక్టర్‌స్టిక్స్, ఇన్‌వెహికల్ కంటెంట్ డిస్‌ప్లే తదితర ఇన్‌కార్ సాఫ్ట్‌వేర్‌ను జీఎం డెవలప్ చేస్తున్నది. ఇటీవల కొన్ని జీఎం కార్లలో సాఫ్ట్ వేర్ సమస్యలు ఏర్పడటంతో వినియోగదారుల నుంచి కంపెనీ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నదిఎదుర్కొన్నది.