మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఏరియా జీఎం దుర్గం రామచందర్ సీఎం పిఎఫ్ పాసు బుక్కులను పంపిణీ చేశారు. గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ పాసు బుక్కులను అందజేసి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. వృద్ధాప్యంలో సీఎం పిఎఫ్ ద్వారా వచ్చే నగదు ఎంతగానో ఆసరాగా నిలుస్తాయన్నారు. తాత్కాలిక అవసరాలకు ఈ నగదును వినియోగించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు 30 లక్షల రూపాయల ప్రమాద బీమా అమలు కొరకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఖాతాలు తప్పకుండా ఉండాలన్నారు.
అనంతరం సింగరేణిలో పనిచేస్తూ మెడికల్ అన్ ఫిట్ అయిన ఆరుగురు కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఏరియా జీఎం రామచందర్ అందజేశారు. వీరిలో నలుగురు యువకులు ఇద్దరు మహిళలు ఉన్నారు. కార్యక్రమంలో ఏజీఎం సివిల్ వెంకటేశ్వర్లు, డీజిఎం పర్సనల్ ఎస్ రమేష్, గుర్తింపు సంఘం నాయకులు వై రాంగోపాల్, ప్రాతినిధ్య సంఘం నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, సీనియర్ పర్సనల్ అధికారె సింగు శ్రీనివాస్ డిజిఎం ఎస్ అండ్ ఏ అనురాధ, సీనియర్ ఎస్టేట్ అధికారి బాబుల్ రాజ్, సెక్యూరిటీ అధికారి కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.