04-04-2025 08:38:21 PM
మందమర్రి,(విజయక్రాంతి): జిఎం (హెచ్ఆర్డి) కార్పొరేట్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తిరుపతిని ఏరియా జిఎం దేవేందర్ ఘనంగా సన్మానించారు. ఏరియా పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం సింగరేణి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏరియా జయం జి దేవేందర్, ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏరియా స్థితిగతులను జిఎం దేవేందర్ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమం లో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా ఇంజనీర్ డీజీఎం (ఈ&ఎం), వెంకట రమణ, డీజీఎం ఐఈడి రాజన్న, డీజీఎం (ఎఫ్&ఎ) ఆర్విఎస్ఆర్కే ప్రసాద్, డివైపిఎం మైత్రేయ బందు, ఐటీ సీనియర్ ప్రోగ్రామర్ రవి లు పాల్గొన్నారు.