ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు టీవీ ఏరియా జేకే5 ఉపరితల గనిలో మంగళవారం అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ప్రాజెక్ట్ అధికారి కృష్ణ మోహన్ అధ్యక్షత వహించగా ఏరియా జీఎం జాన్ ఆనంద్ ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జేకే 5 ఉపరితల గని ఉద్యోగులు ఎంతో క్రమశిక్షణతో, రక్షణ సూత్రాలను పాటిస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని గడువుకు ముందే చేదించడంలో సంస్థలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ఇటు రక్షణలోనే కాకుండా పర్యావరణ పరమైన అంశాలపై ఎన్నో అవార్డులను అందుకున్నారు.
అదే విధంగా పూర్తి ప్రమాదరహితంగా ఉన్న అత్యుత్తమ గనులను ప్రతి ఏడాది కేంద్ర బొగ్గు శాఖ ఈ అవార్డు కు ఎంపిక చేస్తోంది, రక్షణను పెంపొందించడానికి, ప్రమాదరహిత గనుల్లో తిరిగి మేలైన వాటికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ఫైవ్ స్టార్ రేటింగ్ గనుల్లో జేకే5 ఓసి నిలవడం, ఉద్యోగుల రక్షణపై గల నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమన్నారు. ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం కోసం కృషి చేస్తున్న గని అధికారులు మరియు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు.
అదే విధంగా జేకే కాలనీ వాసుల నీటి కష్టాలు తీర్చడానికి డి బ్లాక్ వద్ద నుండి జేకే సివిల్ ఆఫీసు వరకు నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి కాలనీ వాసుల మరియు ఆర్ అండ్ ఆర్ కాలనీ వారికీ నీటిని అందించి నీటి కష్టాలు తీర్చడం జరిగింది. తదుపరి వారిని జేకే గని అధికారులు మరియు ఉద్యోగులు, యూనియన్ నాయకులు సన్మానించారు. అనంతరం జియం గారిని ఏరియా స్టోర్ అధికారులు, ఉద్యోగులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ నరసింహ రాజు, డిజియం పర్సనల్ జివి మోహన్ రావు, గని మేనేజర్ పూర్ణ చందర్, అధికారుల సంఘం అధ్యక్షుడు శివ ప్రసాద్, ప్రాజెక్ట్ ఇంజనీర్ చిన్నయ్య, నాగేశ్వరరావు, సుధాకర్, యూనియన్ నాయకులు సారయ్య, మహబూబ్, రమేష్, నవీన్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.