calender_icon.png 23 October, 2024 | 5:01 AM

దేవుడి మాన్యం అన్యాక్రాంతం

17-09-2024 05:32:22 AM

  1. 34 ఎకరాలకు మిగిలింది ఐదెకరాలే 
  2. పాల్వంచ పట్టణంలో 13వ దశాబ్దపు నాటి మోక్షగుండం వెంకటేశ్వరస్వామి ఆలయం 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పా ల్వంచ పట్టణం గుడిపాడులో గత 13వ దశాబ్దపు నాటి మోక్షగుండం వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆలయానికి 34 ఎకరాల భూములుండగా ఐదెకరాలే మిగిలినట్టు తెలుస్తున్నది. 34ఎకరాల్లోని 20 ఎకరాల భూమిలో 120 గిరిజన కుటుంబాలు నివాసం ఏర్పరుచుకొ ని జీవనం సాగిస్తున్నాయి. మిగిలిన 14 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. గతంలో కలెక్టర్‌గా ఉన్న రజత్‌కుమా ర్ సైనీ గుడిపాడు దేవుని మాన్యం స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని అప్పటి తహసిల్దార్ సతీష్‌శర్మను ఆదేశించారు. ఆయన స ర్వేకు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం కేవలం 5 ఎకరాలు మాత్రమే మిగిలిందని గ్రామస్థులు చెబుతున్నారు. 

అధికారుల పట్టింపులేనితనం

రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఆలయ భూములకు రక్షణ లోపించిందని విమర్శలు వస్తు న్నాయి. మోక్షగుండం వెంకటేశ్వరస్వామి ఆ లయం పేరుకు మాత్రమే దేవాదాయ ధర్మశాఖ పరిధిలో ఉన్నది. ఏనాడు ఆలయ అభి వృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గ్రామస్థులే ఏడాదికి ఒకసారి సొంత ఖర్చుతో దేవుని కళ్యాణం జరిపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ కల్పించుకొని గుడిపాడు దేవుని మాన్యంపై సర్వే చేపట్టి  భూములను కాపాడాలని గుడిపాడు గ్రామస్థులు, పాల్వం చ పట్టణ ప్రజలు కోరుతున్నారు. 

అధికారుల కనుసన్నల్లో అధ్యక్షుడు..

ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆలయానికి కమిటీ నియామకం ప్రభుత్వ ఆదేశానుసార ం జరగాలి. కానీ గుడిపాడు గ్రామానికి చెం దిన ఓ వ్యక్తి మోక్షగుండం వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడినంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. వారి కనుసన్న ల్లోనే అతడి పెత్తనం సాగుతోందనే విమర్శలు వెలువడుతున్నాయి. 

దాత చేయూతతో కొత్త ఆలయం 

గుడిపాడు మోక్షగుండం వెంకటేశ్వరస్వామికి ఓ దాత ముందుకు వచ్చి ఆలయ ని ర్మాణం చేపట్టారు. అదికూడా మందకొండి గా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు చు రుగ్గా సాగిన పనులు ఆ తర్వాత  ఆగిపోయా యి. ప్రస్తుతం 50శాతం పనులు మాత్రమే జరిగాయి. ఇంకా 50శాతం పనులు చేయాల్సి ఉంది. 

నిమజ్జనం తర్వాత దృష్టి సారిస్తాం

మోక్షగుండం వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న వ్యక్తి విషయం మా దృష్టిలో ఉన్నది. వినాయకుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత ఆ అంశంపై దృష్టి సారిస్తాం. ఎండోమెంట్  పరిధిలో ఉన్న ఏ దేవాలయానికి ప్రభుత్వం నిధులు కేటాయించదు. భక్తులు, దాతల సహాయంతోనే ఆలయాల నిర్వహణ ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఎండోమెంట్ కమిటీ మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. 

 రజనీకుమారి, ఈవో