సూర్య భగవానుని మహిమ గురించి ‘బ్రహ్మ పురాణం’లో చాలా స్పష్టంగా ఉంది. ‘అష్టాదశ పురాణాల’లో ఇదొకటి. ఈ పురాణం ప్రకారం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని స్తోత్రం, జపం, పూజ, ఉపవాస వ్రతం, భజన, ఉపహార సమర్పణలతో పాపాల నుండి విముక్తులం కాగలం. ఎవరైతే నేలపై మస్తకం వుంచి సూర్య నమస్కారం చేస్తారో వారు తత్‌క్షణమే పాపాలనుండి ముక్తులు కాగలరు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. భక్తి పూర్వకంగా సూర్యదేవుని కోసం ప్రదక్షిణ పూర్వక నమస్కారం వల్ల సప్త ద్వీపా లు చుట్టి వచ్చిన పుణ్యం లభిస్తుంది. షష్ఠినాడు గాని, సప్తమినాడు గాని ఒక పూట భోజనం చేసి, సూర్యుని ఆరాధిస్తే అశ్వమేథ యజ్ఞఫలం కలుగుతుంది. దివారాత్రాలు ఉపవాసం వుండి పూజించిన యెడల ఆ భక్తుడు పరమగతిని పొందుతాడు.
ఇష్టదేవుణ్ని ప్రార్థించే వారిని ఆమోదిం చటం, వారిలో దోషాలు వెతుకక పోవటం, అన్యదేవుళ్లను నిందించకపోవటం, సూర్యవ్ర తం చేసే వారిని, సర్వకాల సర్వావస్థలలో భగవానుడైన భాస్కరున్ని స్మరించటం వంటి గుణాలు గలవారే నిజమైన భక్తులు. పత్రం, పుష్పం, ఫలం, జలం ఏదైనా భక్తి పూర్వకంగా సమర్పిస్తే దేవుడు స్వీకరిస్తాడు. నియమాలు, ఆచారాలే కాదు, భావశుద్ధి కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. హృద య నైర్మల్యంతో చేసే ఆరాధనలు తప్పక సఫలమవుతాయి.
ఉదయిస్తూనే తన కిరణాలతో ప్రపంచ అంధకారాన్ని దూరం చేస్తాడు సూర్య భగ వానుడు. అందుకే, ఆయణ్ణి మించిన దేవు డు లేడు. సూర్య భగవానుడు ఆది, అంతం లేని సనాతన పురుషుడు. అవినాశియై తన కిరణాలతో ప్రచండ రూపాన్ని ధరించి లోకా లను వెలుగులతో నింపుతున్నాడు. దేవత లంతా సూర్యుని రూపాలై ఉన్నారు. సంపూ ర్ణ జగత్తుకు స్వామియై, సాక్షియై, శ్రేష్ఠుడై, పాలకుడై యున్నాడు. సూర్య భగవానుడే జీవులను సృష్టిస్తూ, సంహరిస్తూ ఉన్నాడు.
తన కిరణాలతో ప్రకాశిస్తూ, వేడిమిని రాజి ల్లజేస్తూ వర్షాన్ని సైతం కురిపిస్తాడు. భాను డు ఎప్పుడు కూడా క్షీణించడు. సృష్టి సమ యంలో సంపూర్ణ జగత్తు సూర్యుని నుండి ఉదయిస్తుంది. ప్రళయ కాలంలో సూర్య చం డ ప్రచండమైన తేజస్సులో లీనమవుతుంది. అందుకే, సకల జీవరాశిసహా మానవాళి అంతా సూర్య భగవానుణ్ని ఆరాధించాలి. సంపూర్ణ జగత్తుకు ఆయనే తల్లి, తండ్రి, గురువు. సూర్యుడు అందరి ఆత్మయై, సంపూర్ణ లోకాలకు ఈశ్వరుడై, దేవతలకే దేవతయై, ప్రజాపతియై వున్నాడు. లోకా లకు ఆధారమై పరమ దేవతయై వున్నాడు. యజ్ఞ కుండాలలో విధి పూర్వకంగా ఇచ్చే ఆహుతి నేరుగా సూర్యభగవానుని వద్దకే చేరుతుంది. క్షణం, ముహూర్తం, దినం, రాత్రి, పక్షం, మాసం, సంవత్సరం, ఋతు వు, యుగం.. ఇలా ఆదిత్యుడు లేకుండా అసలు కాలమే వుండదు.
108 నామాల ఆదిత్యుడు
సూర్య భగవానునికి 108 పేర్లు ఉన్నాయి. ఓం సూర్య, అర్యమా, భగ్, త్వష్టా, పూషా, అర్క్, సవితా, రవి, గభస్తి మాన్, అజ, కాల్, మృత్యు, ధాతా, ప్రభాకర్, పృథ్వీ, ఆప్, తేజ్, ఖ, వాయు, పరాయన్, సోమ్, బృహస్పతి, శుక్,్ర ఋథ్, అంగారక్, ఇంద్,్ర వివస్వాన్, దీప్తాంశ్, శుచి, సౌరి, శనైశ్చర్, బ్రహ్మ, విష్ణు, రుద్ర, స్కంధ, వైశ్రవన్, యమ, వైద్యుత్, అగ్ని, జఠరాగ్ని, ఈంధన్, తేజః పతి, ధర్మధ్వజ్, వేదకర్తా, వేదాంగ, వేద వాహన్, కృత, త్రేతా, ద్వాపర, కలి, సర్వామరాశ్రయ, కలా, కాష్ఠా, ముహూ ర్త, క్షపా, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమో నుద, వరుణ, సాగర, అంశ, జీమూత, జీవన, అరిహా, భూతాశ్రయ, భూతపతి, సర్వలోక నమస్కృత, స్త్రష్టా, సంవర్తక, సర్వాది, అలోలుప, అనంత, కపిల, భాను, కామద, సర్వతోముఖ, జయ, విశాల, వరద, మన్, సుపర్ణ, సర్వభూత నివేషిత, భూతాది, శీఘ్రగ, ప్రాణధార ణ, ధన్వంతరి, ధూమకేతు, ఆదిదేవ, అదితిపుత్ర, ద్వాదశాత్మా, దక్ష, పితా, మాతా, పితామహ, స్వర్గద్వార్, ప్రజా ద్వార్, మోక్షద్వార్, త్రివిష్టప, దేహకర్తా, ప్రశాంతాత్మా, విశ్వాత్మా, విశ్వతోముఖ, చరాచరాత్మా, సూక్ష్మాత్మా, మైత్రేయ, కరుణాన్విత.