హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఏఎమ్.రెడ్డి నాయ కత్వంలో సనా సలావుద్దీన్ సిద్ధిఖీ, లోకేష్ అమరావతి నేతృత్వంలోని డైనమిక్ యంగ్ కంపెనీ ‘ఎఫ్‌ఎస్‌ఎల్ కొలాబ్‌రేషన్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ది పార్క్’ హోటల్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్‌తో పాటు నగరంలోని పలు ప్రముఖ హాస్పిటల్స్ డైరెక్టర్లు విచ్చేశారు. ‘ది లుమినరీ హెల్త్ అవార్డ్స్’లో భాగంగా ఎంపీ ధర్మపురి అరవింద్, సియాసత్ డైలీ ఉర్దూ వార్తా పత్రిక డైరెక్టర్ అమీర్ అలీఖాన్, స్టార్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ మన్నం గోపిచంద్‌కు సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డులు, ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణ పట్ల వహించే బాధ్యతల గురించి వైద్యులు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే బజాజ్ ఎలక్ట్రానిక్స్, మారుతీ సుజూకీ నెక్సా, పిస్టా హౌస్, హానర్ హోమ్స్ డెవలపర్స్, శ్రీకృష్ణ జ్యువెల్లర్స్, బాలాజీ జ్యువెల్లర్స్, పి.సత్యనారాయణ జ్యువెల్లర్స్, టూట్ డెంటల్ చైన్ వంటి ప్రముఖ బ్రాండ్ల వ్యవస్థాపకులు హాజరై హెల్త్‌కేర్.. వ్యాపారాల మధ్య సహకారాన్ని అందిపుచ్చుకున్నారు. కేర్ హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్‌తో పాటు ప్రముఖ హాస్పిటల్స్ నుంచి 300 మంది వైద్యులు పాల్గొన్నారు.