calender_icon.png 18 January, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ కుసుమహరనాథ ఆనంద మేలోత్సవాలు

18-01-2025 02:29:22 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని 18వ వార్డు సమీపంలో గల ఎల్లన్న గ్రౌండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ ఇల్లందు వారి ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సంకీర్తనలతో పూజా కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ కుసుమహరనాథ సేవ సమితి అధ్యక్షుడు పుల్లూరుస్వరాజ్ గుప్త జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ... శ్రీ కుసుమహరనాథ 80వ ఆనంద మేలోత్సవములు చాలా ఘనంగా నిర్వహిస్తామని, ఇక్కడే కాకుండా ప్రతి ఏటా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆనంద మేలోత్సవములు జరుపుకుంటామని ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని తెలిపారు. ఈ పూజలు పాల్గొనే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మూడు రోజులపాటు వివిధ పూజ కార్యక్రమాలు చాలా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు.

ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉంటాయని మొదటిరోజు ప్రభాత సేవ, ప్రభాత సంకీర్తన, జ్యోతి ప్రజ్వలన, ఉపన్యాసాలు, సామూహిక సంకీర్తనలు, రెండవ రోజు శ్రీ కుసుమారనాథ లీల కళ్యాణం, సామూహిక రక్తదాన కార్యక్రమం, నారాయణ సేవ, చిన్నారులచే బాలానందం కార్యక్రమాలు, మూడవ రోజు ఉదయం 5గంటల నుండి జై హరినాధ జయ కుసుమ కుమారి జయనామ సంకీర్తన కార్యక్రమం ప్రారంభించుకొని వస్త్రధానము, రాత్రి 7 గంటలకు పట్టణ పురవీధులలో శ్రీ కుసుమహరనాధుల ఊరేగింపు అనంతరం దివ్య హారతితో ఈ కార్యక్రమం ముగింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార సంస్థ హైదరాబాద్ అధ్యక్షుడు తోట కరంచంద్, ఆర్. నరసింహ రావు, ఆర్ వీరభద్రరావు, పుల్లూరు హరినాథ్, పుల్లూరు సదానందం, రామ్మోహన్ రావు, సురేష్, నవీన్, ప్రచార సంస్థ కర్త పుల్లూరు జ్యోతి, సుజాత, నవ్యశ్రీ తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.