calender_icon.png 2 April, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గ్లోరియస్ పాఠశాల వార్షికోత్సవం

29-03-2025 08:58:00 PM

పటాన్ చెరు: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేది ఉపాధ్యాయులేనని గ్లోరియస్ పాఠశాల కరెస్పాండెంట్ సింహాచలం అన్నారు. జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న గ్లోరియస్ పాఠశాల12వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. సందేశాత్మకంగా నిర్వహించిన పలు కళారూప ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. 

ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు కెజెఆర్ ఆనంద్ కృష్ణా రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు గుండ్ల మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు వి. ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు పాఠశాల కరస్పాండెంట్ సింహాచలం ప్రిన్సిపాల్ పవిత్ర జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్ లు కొత్వాల్ హరికృష్ణ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి, ప్రభుకుమార్, కరుణసాగర్ రెడ్డి, శ్రీనివాస్, లోకానాదం, రాంబాబు, శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాల ప్రతినిధులు మహిపాల్ రెడ్డి, హరిప్రియ, అబకస్ ట్రైనర్ స్నేహ, పాఠశాల ఉపాధ్యాయిలు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.