calender_icon.png 5 February, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర

04-02-2025 11:10:16 PM

పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని రామేశ్వరంబండలో మంగళవారం నిర్వహించిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. మండల, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడి నిర్మాణం కోసం తన తండ్రి కీర్తిశేషులు గూడెం సత్తిరెడ్డి జ్ఞాపకార్థం ఐదు గంటల సొంత స్థలం అందజేయడంతో పాటు రూ.20 లక్షల సొంత నిధులు అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు. మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.