calender_icon.png 16 November, 2024 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా మహా గణపతి తొలిపూజ

09-09-2024 03:43:21 AM

  1. ఈ గణేశ్ ఉత్సవాలు తెలంగాణకు గర్వకారణం 
  2. గతేడాది పీసీసీ అధ్యక్షుడిగా.. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చా 
  3. ప్రభుత్వం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది 
  4. ఖైరతాబాద్ గణేశునికి తొలిపూజ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): చారిత్రక ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 70 అడుగుల సప్తముఖ మహాశ క్తి గణపతి తొలి పూజ శనివారం వైభవంగా జరిగింది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆధ్వర్యంలో జరిగిన తొలి పూజకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. వేదపండితు ల సమక్షంలో మహాశక్తిగణపతికి తొలిపూజ చేశారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వైభవంగా ఏడు దశాబ్దాలుగా ఉత్సవాలను నిర్వహించ డం గర్వకారణమన్నారు. దేశం దృష్టిని ఆకర్షించే విధంగా నిర్వహించడం వల్ల గొప్ప గుర్తింపు లభించిందని చెప్పారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం వల్ల శాంతి, మతసామరస్యం, పాడిపంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ‘గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్సవాలకు వచ్చా.. ఈ సారి సీఎంగా వచ్చా. భవిష్యత్‌లో కూడా ఎప్పుడు ఆహ్వానించినా రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని స్పష్టం చేశారు. 

ప్రజాపాలనలో ప్రజాహిత కార్యక్రమాలు

హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభు త్వం ప్రజాపాలన పేరిట ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించే విధంగా ఘనం గా నిర్వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ మాట్లా డుతూ రాష్ట్రంపై గణేశ కృప ఉండాలని ఆశించారు. దానం నాగేందర్ మాట్లాడు తూ మహారాష్ట్రలోని లాల్‌బాగ్‌కా రాజా ఉత్సవాల కంటే ఘనంగా ఖైరతాబాద్ కా రాజా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సన్మానం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, డా.రోహిణ్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల రాంచంద్రారెడ్డి, విజయరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ సిరంగి రాజ్‌కుమార్,  సభ్యులు గజ్జెల నగేశ్,  కృష్ణ యాదవ్,  తదితరులు పాల్గొన్నారు. 

గణేశ్ ఉత్సవాలకు ఉచిత కరెంట్.. 

ఈసారి గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసు కుని, ఖైరతాబాద్‌గణేశ్ ఉత్సవ కమిటీ సహా నగరంలోని నిర్వాహకులందరినీ సచివాలయానికి  ఆహ్వానించిందని స్పష్టం చేశారు. ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం తరపున సహకారం అందించామన్నారు. హైదరాబాద్‌లో లక్షా 40 వేల విగ్రహాలు నెలకొల్పార ని,  కమిటీల విజ్ఞప్తి మేరకు గణేశ్ మం డపాలకు ప్రభుత్వం ఉచిత కరెంటును అందించిందని తెలిపారు. 1954 నుంచి నేటివరకు ఉత్సవాలు నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సంప్రదాయం కొనసాగాలన్నారు. వర్షాల కారణంగా వరదలు రావడం తో పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలిగాయని, దేవుడి దయ, ఆశీర్వాదంతో తక్కువ నష్టంతో భయట పడ్డామని ముఖ్యమంత్రి అన్నారు. అనంతరం  రేవంత్‌రెడ్డిని ఉత్స వ కమిటీ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందించారు.