calender_icon.png 23 October, 2024 | 10:08 AM

గ్లోబల్ ట్రెండ్స్, క్యూ1 ఫలితాలపై దృష్టి

15-07-2024 12:05:00 AM

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్ నాలుగు రోజుల ట్రేడింగ్‌కే పరిమితమయ్యే ఈ వారంలో అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలకు అనుగుణంగా కదులుతుందని విశ్లేష కులు అంచనా వేస్తున్నారు. గతవారం టీసీఎస్ అంచనాల్ని మించిన ఫలితాల్ని వెల్లడించడంతో ఐటీ షేర్లు జరిపిన భారీర్యాలీతో స్టాక్ సూచీలు రికార్డుస్థాయి వద్ద ముగిసాయి. గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 522 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్ల చొ ప్పున లాభపడ్డాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 80,519 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,502 పాయింట్ల వద్ద ముగిసాయి. ఈ ఫలితాల సీజన్‌లో ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర పలు బ్లూచిప్ కంపెనీలు ఈ వారం వెల్లడించే క్యూ1 గణాంకాలు ఇన్వెస్టర్ల రాడార్‌లో ఉంటాయని విశ్లేషకులు చెప్పారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ ఫలితాలపై కూడా మార్కెట్ దృష్టిపెట్టిందన్నారు. అలాగే అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ట్రే డింగ్ యాక్టివిటీ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని అన్నారు. వచ్చే బుధవారం మొహర్రం సందర్భంగా మార్కెట్లకు సెలవు అయినందున, ఈ వారం నాలుగు రోజులే ట్రేడింగ్ జరుగుతుంది. 

బడ్జెట్ అంచనాలతో ఒడిదుడుకులు

కార్పొరేట్ ఫలితాలతో పాటు బడ్జె ట్ ముందస్తు అంచనాలు మార్కెట్‌ను ఒడిదుడుకులకు గురిచేయవచ్చని స్వ స్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సం తోష్ మీనా చెప్పారు. అంతర్జాతీయం గా చూస్తే ఈ వారం చైనా వెల్లడించే జీ డీపీ గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి డే టాలపై  మార్కెట్ ఫోకస్ ఉన్నదని తెలిపారు. యూఎస్ ఫెడ్ చైర్మన్ ప్రసం గం, యూఎస్ రిటైల్ సేల్స్ డేటా కూ డా ఇన్వెస్టర్లకు ప్రధాన అంశాలేనని మీనా వివరించారు. గత శుక్రవారం మా ర్కెట్ వేళలు ముగిసిన తర్వాత వెలువడిన హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు, రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై సోమవారం ట్రేడిం గ్ ప్రారంభంలో ఇన్వెస్టర్ల స్పందన ఉం టుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు.

అటుతర్వాత కార్పొరేట్ ఫలితాలు, చైనా, యూఎస్ డేటా లపై దృష్టి మళ్లిస్తారని అన్నారు. దేశం లో జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠస్థాయి 5.08 శా తం వద్దకు చేరిన సంగతి తెలిసిందే. ఎర్నింగ్స్ సీజన్‌కు శుభారంభాన్ని ఇచ్చినందున, గైడెన్స్‌ను పెంచినందున ఐటీ షేర్లు వెలుగులో ఉంటాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అంచనా వేశారు.