03-04-2025 09:49:43 AM
ట్రంప్ సుంకాల ప్రకటనతో నష్టాల్లో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్
ట్రంప్ సుంకాల మోత.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు(US President Donald Trump) డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనలతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్(International stock market) నష్టాల్లో కొనసాగుతోంది. సుమారు నాస్ డాగ్ ఫ్యూచర్స్ 4 శాతం నష్టపోయింది. జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వరస సెషన్లలో లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైంది.
ట్రంప్ టారిఫ్ ప్రకటనల(Trump's tariff announcements) వేళ అంతర్జాతీయ మార్కెట్ నష్టాల్లో చవిచూసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. 3.4 శాతం పడిన జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా మార్కెట్లు 1.9 శాతం కుంగాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు(US futures markets) కుదేలైంది. ఎస్అండ్ పీ 500 ఫ్యూచర్స్ సూచీ 3శాతం పడిపోయింది. ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్ తో బంగారం ధర పరుగులు పెడుతోంది. అమెరికాలో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 0.4 శాతం పెరుగుదల కనిపించింది. భారత్ పై 26 శాతం టారిఫ్ మోత మోగించిన ట్రంప్, అత్యధికంగా కాంబోడియా దిగుమతులపై 49 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.