calender_icon.png 20 November, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షోభంలో ‘గ్లోబల్ సౌత్’ దేశాలు

20-11-2024 01:07:52 AM

ఆయా దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత

సమస్యల పరిష్కారానికి ప్రపంచ దేశాలు సహకరించాలి

-జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీ

బ్రసిలియా, నవంబర్ 19: ప్రపంచ దేశాల మధ్య వైరుధ్యాల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షో భం ఏర్పడిందని, ఆ ప్రభావం ఆయా దేశాల ప్రజలపై ప్రతికూలత చూపుతున్నాయని ప్రధా ని మోదీ అన్నారు. బ్రెజిల్‌లోరి రియో డిజనిరోలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. భారత్ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే స్ఫూర్తితో ముందుకు వెళ్తుందని, అదే స్ఫూర్తితో గతేడాది జీ20 సదస్సు నిర్వహించామని స్పష్టం చేశారు.

జీ20 సదస్సులో ప్రధాని మోదీ బ్రెజిల్ సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు. బ్రెజిల్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప డుతున్న గ్లోబల్ అలయన్స్ ఎగైనెస్ట్ హంగర్ అండ్ పావర్టీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘గతేడాది భారత్ సమర్థంగా జీ20 సమావేశం నిర్వహించింది. అదే స్ఫూర్తితో ఈసారి సదస్సు నిర్వహిస్తునా’మని వ్యాఖ్యానించారు. 

ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ భేటీ..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘రెండు దేశాల మధ్య అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి సంబంధాలపై మేం చర్చించా’మని వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తోనూ చర్చించారు. ‘రానున్న కాలంలో భారత్ సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, రక్షణ వంటి రంగాల్లో బ్రిటన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపరిచే విధంగా నడచుకోబోతున్నాం’ అని పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో జరిగిన భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలు కొనసాగిస్తాం.’ అన్నారు. 

సదస్సు ఫొటోలో బైడన్, ట్రూడో మిస్సింగ్

ప్రపంచ దేశాధినేతలందరూ కలిసి దిగిన ఫొటోకు జో బైడన్‌తో పాటు జస్టిన్ ట్రూడో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జార్జియా మెలోనీ లేకపో వడం చర్చనీయాంశమైంది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ20 సదస్సులో ఈ ఫొటో తీయగా ప్రస్తుత ం నెట్టింట వైరల్ అయింది. ఫొటోలో జీ జిన్‌పింగ్, మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు తదితరులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు చిత్రంలో లేకపోవడంపై వైట్ హౌస్ నుంచి ప్రకటన విడుదలైంది.

ఫొటో తీస్తున్న సమయంలోబైడన్ మరోచోట  ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని అధికార వర్గాలు ప్రకటించా యి. అధ్యక్షుడిగా జో బైడన్  చివరి జీ 20 సదస్సు కావడంతో ఆయన ఫొటోలో కనిపించకపోవడం చర్చకు దారి తీసింది.