హైదరాబాద్,(విజయక్రాంతి): గ్లోబల్ లాజిక్ సాఫ్ట్ వేర్ నూతన కార్యాలయాన్ని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు. అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు తగిన తోడ్పాటునందిస్తోందని, ఎంఎన్సీలకే కాకుండా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు 20 శాతం పెరిగేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అనంతరం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మరో నాలుగైదు నెలల్లో పీపీపీ విధానంలో ఏఐ సిటీ నిర్మాణం జరుగుందని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీధర్ బాబు వెల్లడించారు.