calender_icon.png 31 January, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియాద్‌లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు

30-01-2025 12:39:41 AM

జగిత్యాల, జనవరి 29 (విజయక్రాంతి): సౌదీ అరేబియా రాజధాని రియాద్’లో రెండు రోజుల పాటూ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు’ బుధవారం ప్రారం భమైంది. ఈ సదస్సులో 45 దేశాల కార్మిక మంత్రులు, అంతర్జాతీయ సంస్థల ప్రతిని ధులు, 200 మంది వక్తలు, సుమారు 100 దేశాల నుంచి 5 వేలకు పైగా ప్రతిని ధులు పాల్గొన్నట్లు సమాచారం.

ఇండియన్ నేషన ల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ (ఐఎన్టీ యూసీ) జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎం పీ రామచంద్ర కుంతియా, తెలంగాణకు చెందిన వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి, రియాద్’లో నివసిస్తున్న ఏపికి చెందిన సామాజిక సేవకురాలు చేతన జగదీ ష్గారి సదస్సులో పాల్గొన్నారు.

ఈ సదస్సు లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, అంత ర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) ప్రతినిధుల మధ్య సమావేశాలు జరుగుతాయి. ప్రపంచ బ్యాం కు, ఐక్యరాజ్య సమితి అభివద్ధి కార్యక్రమ ఆర్థిక సంస్థ సహకారంతో 50కి పైగా ప్రత్యేక చర్చలు జరుగుతాయి. కీలకమైన లేబర్ మార్కెట్ సవాళ్లను పరిష్కరించడం, వినూ త్న పరిష్కా రాలు, ఉత్తమ పద్ధతులు, ప్రపం చ అనుభవాలను ప్రదర్శించడంపై ఈ సద స్సు దష్టి సారిస్తుంది.

దేశాలు, సంస్థల మధ్య ఒప్పందాలు కూడా ఈ సదస్సులో జరుగు తాయి. ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ వేగవంతమైన మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను అభివద్ధి చేయడం, యువత ఎదుర్కొంటున్న సవాళ్ల ను పరిశీలించడంతో పాటూ ప్రపంచస్థాయి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డి కషి చేస్తున్నారని పేర్కొన్నారు.