- సింగపూర్ ఐటీఈతో కీలక ఒప్పందం
- నైపుణ్యాభివృద్ధికి పరస్పర సహకారం
- త్వరలోనే హైదరాబాద్‌కు ఐటీఈ బృందం
- ఆ దేశ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
- విమానాశ్రయంలో ప్రవాసుల ఘనస్వాగతం
- తొలిరోజు సీఎం పర్యటనకు విశేష స్పందన
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీ గ్లోబ ల్ ఇమేజ్ సంతరించుకునేందుకు కీలక ముందడుగు పడింది. సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) యూనివర్సిటీ మధ్య కీలక ఒప్పం దం కుదిరింది.
స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు ఐటీఈ బృందం సంసిద్ధతను వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కూడిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం శుక్రవారం సింగపూర్‌లో పర్యటించింది. తొలి రోజు పర్యటనలో భాగంగా బృందం ఐటీ ఈ క్యాంపస్‌ను సందర్శించింది.
అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు లు, సదుపాయాలను పరిశీలించారు. అక్క డ అందిస్తున్న శిక్షణ గురించి దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందితో నేరుగా మాట్లాడారు. ఆ తర్వా త ఐటీఈ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు.
హైదరాబాద్‌లోని ఫోర్త్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని సీఎం కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్ అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు ఐటీఈ బృందానికి వివరించారు.
స్కిల్ డెవెలప్మెంట్ శిక్షణలో పరస్పరం సహకరించుకో వాలని సీఎం ప్రతిపాదించగా.. ఐటీఈ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. చర్చల అనంతరం నైపుణ్యాల అభి వృద్ధిలో కలిసి పనిచేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నా యి.
ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకడమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్ సంతకాలు చేశారు. ఆయనతో పాటు ఐటీఈ ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఇందులో పాల్గొన్నారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శించనుంది.
విదేశాంగమంత్రితో సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారుల బృందం సింగపూర్‌కు చేరుకున్న వెంటనే తొలుత ఆదేశ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ఆయనతో కీలక అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునరుజ్జీవం, నీటి వనరుల నిర్వహణ, హరిత ఇంధనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల విషయంలో విస్తృత సహకారంతో పాటు దీర్ఘకాలిక భాగస్వామ్యాల అంశంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు.
విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసుల సందడి
సింగపూర్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ బృందానికి విమానాశ్రయంలో ఘనస్వా గతం పలికారు. సీఎం వస్తున్నారనే సమాచారంతో విమానాశ్రయం తెలంగాణ ప్రవా సులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా సీఎం పర్యటన విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు.
మూడురోజుల సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి బృందం పాల్గొననుంది. పర్యనటలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు ఉన్నారు.