calender_icon.png 8 January, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సిటీ హైదరాబాద్

05-01-2025 01:45:21 AM

  • ఇక్కడ అవకాశాలు అపారం

రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టండి

సింగిల్ విండో ద్వారా అనుమతులిస్తాం

ఇక్కడ సెటిల్ అయిన వారికి రాజకీయాల్లోనూ అవకాశం  

ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో అపారమై న అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కదిలిరావాలని ఆయన ఎన్నారైలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో అన్ని రంగాలకు విస్తృతమైన అవకాశాలున్నాయని స్పష్టంచేశారు.

శనివారం హైదరా బాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వువార్షిక మహా సభ ల్లో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని ఇక్కడ అవకాశాలు, రాజకీయ, వ్యాపార అవకాశాలు ఉన్నాయని తెలి పారు. ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రా, ఏఐ, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ మొదలైనవన్నీ పెట్టుబడులకు మార్గాలను సుగమం చేస్తున్నాయని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌లో సెటిల్ అయిన వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకు తమ పార్టీ, ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సినీ, పరిశ్రమలు, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో సెటిల్ అయిన వారికి అవకాశాలుంటాయ ని పునరుద్ఘాటించారు. ఈ ప్రభుత్వం మీది, మనది, మనందరిదని.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని, శాంతిభద్రతలు పుష్కలంగా ఉన్న తెలంగాణలో మీ పెట్టుబడులకు సంపూర్ణ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. 

సింగిల్ విండో విధానంలో అనుమతులు

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందు కు వచ్చే వారందరినీ కచ్చితంగా తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు సమాఖ్య కార్యక్రమం ద్వారా తెలంగాణకు భారీగా పెట్టుబడులు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు భారీగా పెరగాలని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారు తమను సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే టూరిజం పాలసీ తీసుకవచ్చామని, ఎనర్జీ పాలసీకి క్యాబినెట్ అనుమతించిందని చెప్పారు.

ఈ మార్పులన్నీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. పెట్టుబడులు పెట్టండి... హైదరాబాద్‌కు రండి... న్యూయార్క్, లండన్, టోక్యోతో పోటీపడి పనిచేసేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.