calender_icon.png 20 March, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోకోమా వ్యాధిని ఆదిలోనే గుర్తించాలి

19-03-2025 01:48:31 AM

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (విజయ క్రాంతి) గ్లోకోమా వ్యాధిని ఆదిలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టవచ్చని డాక్టర్ సిద్ధార్థ దీక్షత్ సూచించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర విజ్ఞాన కేంద్రంలో గ్లోకోమా అవగాహన సదస్సు నిర్వహించారు.

నవభారత్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి యందు మార్చ్ 9 నుండి 15 వ తారీఖు వరకు గ్లూకోమా వార్షికోత్సవ సందర్భంగా ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో గ్లోకోమా కన్సల్టెంట్ స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ సిద్ధార్థ దీక్షత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గ్లోకో మా వ్యాధి ఎలా వస్తుంది, వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం , చేయవలసిన వ్యాయామం, గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నవభారత్ కంటి ఆసుపత్రి డాక్టర్ శ్వేత  మాట్లాడుతూ గ్లూకోమా అనేది చూపు దొంగ ఈ వ్యాధి త్వరగా గుర్తిస్తే, ఈ వ్యాధిని త్వరగా నిర్మూలించవచ్చు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత, డాక్టర్ దివ్య త్రిపాఠి, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ హిరిక,  డాక్టర్ అనుప్రియ, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ దేవి చందర్ రావు, విజన్ సెంటర్ కోఆర్డినేటర్ సాయి తేజ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.