calender_icon.png 27 September, 2024 | 4:49 AM

కారుణ్య మరణాలకు గ్లామర్!

27-09-2024 03:10:52 AM

  1. ఆత్మహత్య కోసం ప్రత్యేక డివైజ్
  2. నొప్పి లేకుండా చనిపోయేవారి కోసం తయారీ
  3. స్విట్జర్లాండ్‌లో ఓ మహిళ బలవన్మరణంతో వెలుగులోకి..
  4. తీవ్రంగా స్పందించిన స్విస్ ప్రభుత్వం
  5. మరణానికి సాయపడినవారి అరెస్టు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: కారుణ్య మర ణం.. పరిస్థితులను బట్టి కొందరు దీన్ని సరై న ఆప్షన్‌గా ఎంచుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధులు, నొప్పులు భరించలేక నరకయాతన అనుభవించేవారు కారుణ్య మరణా లను కోరుకుంటారు. కొన్ని దేశాల్లో ఇవి చట్టబద్ధమే అయినప్పటికీ చాలా దేశాలు వీటికి అనుమతించడంలేదు. కానీ, దీనిపై చర్చ వచ్చినప్పుడల్లా ఈ అంశం వివాదాస్పదంగానే ఉంటుంది.

ముఖ్యంగా భారత్‌లో కోర్టుల అనుమతితో అత్యంత అరుదైన సం దర్భాల్లోనే కారుణ్య మరణాలకు అవకాశం ఉంటుంది. కానీ, ఇటీవల జరిగిన ఓ సంఘటన కారుణ్య మరణాలను గ్లామరైజ్ మార్చే ప్రయత్నం చేసింది. మరణించడానికి సూసై డ్ పాడ్ అనేక ప్రత్యేక పరికరాన్ని రూపొందించి.. అందులో బటన్ నొక్కడం ద్వారా ఆక్సిజన్ స్థాయిలు తగ్గించి ఆత్మహత్య చేసుకునేలా తయారుచేయడం చర్చనీయాం శమైంది. ఈ పరికరాన్ని త్రీడీ ప్రింటింగ్ సా యంతో ఇంట్లోనే రూపొందించుకునే వెసులుబాటు సైతం ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డివైజ్‌ను భవిష్యత్తులో దుర్విని యోగం చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. 

అసలేంటీ డివైజ్?

స్విట్జర్లాండ్‌లోని లాస్ట్ రిసార్ట్ సంస్థకు సంబంధించిన సూసైడ్ హెల్ప్ గ్రూప్ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ సూసైడ్ పాడ్‌ను రూపొందించింది. దీన్ని సార్కోఫాగస్ లేదా సార్కోపాడ్‌గా పిలుస్తున్నారు. ఇందులో త్రీడి ప్రింటెడ్ అనే చిన్న చాంబర్ ఉంటుంది. దీన్ని 100 శాతం నైట్రోజన్‌తో నింపేస్తారు. ఈ పాడ్‌లోకి వెళ్లిన వ్యక్తి ఎమర్జెన్సీ బటన్ నొక్కగానే క్రమంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అందులో పూర్తిగా నైట్రోజన్‌ను నిండుతుంది. దీంతో పాడ్‌లో ఉన్న వ్యక్తి క్షణాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. 10 నిమిషాలలోపే మనిషి చనిపోతాడు. ఈ పరికరంతో యూఎస్‌కు చెందిన ఓ మహిళ చనిపోవడం ఇప్పుడు వివాస్పదంగా మారింది. స్విట్జర్లాండ్‌లో ఈ పోర్టబుల్ త్రీడీ ప్రింటెడ్ సూసైడ్ పాడ్‌ను ఉపయోగించి ప్రాణాలు తీసుకుంది. 

మిశ్రమ వాదనలు

సూసైడ్ పాడ్‌తో పాటు ఈ ప్రక్రియపై తీవ్రస్థాయిలో చర్చ  జరుగుతోంది. ఈ సూసైడ్ పాడ్ ఆత్మహత్యను గ్లామరైజ్ చేస్తోందని చాలామంది విమర్శిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే పాడ్‌లను వినియోగించడం ప్రమాదకరమైన చర్య అని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ సూసై డ్ పాడ్‌ను కొంతమంది న్యాయవాదులు మాత్రం సమర్థిస్తున్నారు. ఔషధాలు, వైద్యు ల అవసరం లేనందున వీటిని ఆచరణీయమైన ఎంపికగా పేర్కొంటున్నారు. నొప్పి లేకుండా మరణం సంభవించడం కొంతమందికి వరమని చెబుతున్నారు. అయితే, స్విస్ ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రంగా పరగణిస్తోంది. నైట్రోజన్ వాడకం చట్టబద్ధం కాదని చెబుతోంది. సూసైడ్ పాడ్‌ను నిర్వహించేవారు ఐదేళ్ల జైలు శిక్షతో సహా క్రిమిన ల్ ప్రొసీడింగ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.    

స్విస్ ప్రభుత్వం సీరియస్

స్విస్-జర్మనీ సరిహద్దుకు సమీపం లో ఉన్న మెరిచౌసెన్‌లోని అటవీప్రాంతంలో మహిళ ఈ సూసైడ్ పాడ్ ద్వారా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఆమె సూసైడ్‌కు సహకరించిన అందిరినీ స్విట్జర్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సూసైడ్‌కు లాస్ట్ రిసార్ట్ సహావ్యవస్థాపకుడు ఫ్లోరియన్ విల్లెట్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు తెలిపారు. అరెస్టు తర్వాత విల్లెట్ మాట్లాడుతూ.. సదరు మహిళ వేగంగా, ప్రశాంత మరణాన్ని పొందినట్లు పేర్కొనడం గమనార్హం. అమెరికా కు చెందిన ఆ మహిళ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. 

కానీ, స్విట్జర్లాండ్‌లో కారుణ్య మర ణం చట్టబద్ధమే ఈ పద్ధతిపై ఆందోళన నెలకొంది. స్విస్ ఆరోగ్యమంత్రి ఎలిజబెత్ బామ్ మాట్లాడుతూ.. ఇలాంటి పాడ్‌ల వినియోగానికి అనుమతి ఇవ్వకూడదని, రసాయనాల చట్టం ప్రకారం నైట్రోజన్ వాడకం సరైనది కాదని చెప్పా రు. దీంతో బాధలేని మరణం పొందినా ఇలాంటి పరికరాలతో దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని బామ్ ఆందోళన వ్యక్తం చేశారు.