17-04-2025 01:45:27 AM
సీపీ సాయి చైతన్య, ఇకనుంచి జిల్లాలో ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’
నిజామాబాద్ ఏప్రిల్ 16: (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. మైనర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టామని ఆయన వివరించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ మితిమీరిన వేగంతో ట్రాఫిక్ రూల్స్ ను అధిక్రమిస్తూ న్నారనీ ఆయన అన్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానాలు విధించా మన్నారు. పలుమార్లు ఈ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నీ నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు దర్జాగా వాహనాలు నట్టు తమ దృష్టికి వచ్చిందని పలు ప్రమాదాల ఫిర్యాదులు తమకు అందాయన్నారు. తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించకపోవడం కారణంగా నే మైనర్లు వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారని ఆయన తెలిపారు.
మైనర్లు వాహనాలు నడపడం బై స్పెషల్ డ్రైవ్ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే మూడేళ్ల జైలుశిక్ష పాటు జరిమానా విధిస్తారని ఆయన తెలిపారు. మైనర్లు వాహనాలు నదుపుతూ పట్టుపడితే వారి తల్లిదండ్రులను ఎంవీ యాక్ట్ 2019 ప్రకారం యేసు నమోదు చేసి కోర్టు లో హాజరుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎం వి ఏ యాక్టు 2019 ప్రకారం మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. రూ.25వేల జరిమానా విధిస్తారని వివరించారు. ఏడాది పాటు వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.