calender_icon.png 16 January, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మాన్‌సాగర్ వివరాలు ఇవ్వండి

03-09-2024 12:59:59 AM

తదుపరి ఉత్తర్వుల వరకు కూల్చకండి

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఉస్మాన్‌సాగర్‌కు చెందిన మ్యాప్ వివరాలను సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్‌లో తమ వినతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కూల్చివేతలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ జీ విద్యాధర్‌రెడ్డి, ఎస్ అనుపమ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ టీ వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆగస్టు 9న అధికారులు జారీచేసిన నోటీసులకు ఆధారాలతో సహా 13న వివరణను అందజేసినట్టు తెలిపారు. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే 18న పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. 2015లో కూడా ఇలాగే నోటీసులు జారీ అయ్యాయని, అప్పట్లో సంయుక్త తనిఖీలు నిర్వ హించగా పిటిషనర్ల భూములు ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో లేవని తేల్చి చెప్పా రన్నారు.

ఇప్పుడు మళ్లీ ఎఫ్టీఎల్లో ఉన్నాయం టూ కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి గతంలో తనిఖీలు చేసిన అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో స్థలాలు లేవంటూ ధ్రువీకరించిన తరు వాత తిరిగి నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టడంపై సందేహాలున్నాయని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా పిటిషనర్లకు చెందిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.