calender_icon.png 3 April, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూములకు పట్టాలు ఇప్పించండి

03-04-2025 12:24:30 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరిన ఫుల్ మద్ది గ్రామ రైతులు

వికారాబాద్, ఏప్రిల్ 2 ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటూ, జీవనం సాగిస్తున్న భూమికి పట్టాలు ఇప్పించాలని ఫుల్ మద్ది రైతులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బుధవారం వికారాబాద్ మండల ఫుల్ మద్ది గ్రామ రైతులు కలిసి భూ సమస్యలు పరిష్కరించాలని విన్నతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... ఎన్నో ఏండ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ ప్రభుత్వం వచ్చిన ఆ మంత్రి వర్గంలో ఉన్న అటవీ శాఖ  మంత్రిని కలిసి తమ బాధను విన్నవిస్తే అప్పటి వరకే అధికారుల నుంచి రైతులకు ఒత్తిడి తగ్గుతుందన్నారు.1985 కు ముందు ఈ భూమి ప్రభుత్వ భూమిగా ఉండేదని,కానీ 1985 తరువాత ఫారెస్ట్ భూమి అంటూ ఫారెస్ట్ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని తెలియజేశారు.

ఈ సాగు చేస్తున్న భూమి 200 ఎకరాలు ఉందని,దానిలో సాగు చేస్తుంది బిసి,ఎస్సి వర్గాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు ఉన్నారని చెప్పారు.కొందరు రైతులకు పట్టాలు కూడా ఉన్నాయని,కొందరికి గతంలో భూమికి శిస్తూ కట్టిన రశీదులు ఉన్నాయని వివరించారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు విన్నవించారు.స్పీకర్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.స్పీకర్ ను కలిసిన వారిలో రైతులు శ్యామ్, సుదర్శన్, అంజయ్య, లక్ష్మణ్, దానయ్య, బిచ్చయ్య, నర్సింహులు, భుజంగం తదితరులు ఉన్నారు.