calender_icon.png 4 March, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా డబ్బులు ఇప్పించండి మహాప్రభో!

04-03-2025 12:13:20 AM

  1. రాత్రింబవళ్లు పనిచేశాం
  2. ఒక్క రూపాయి ఇవ్వలేదు
  3. రేపు, మాపంటూ కాలం వెళ్లదీస్తున్న అధికారులు 
  4. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఏంట్రీ ఆపరేటర్ల ఆవేదన

వైరా, మార్చి 3 (విజయక్రాంతి) ః ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తులను రాత్రింబవళ్లు  కష్టపడి డేటా ఎంట్రీ నమోదు చేశామని... నాలుగు నెలలు గడుస్తున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. నిరుద్యోగులైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు విజయ క్రాంతి దినపత్రిక ప్రతినిధికి తమ ఆవేదనను సోమవారం  వెళ్ళబుచ్చారు..

డిసెంబర్ నెలలో ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తులను  డేటా ఎంట్రీ చేయించేందుకు గాను.. వైరా మున్సిపాలిటీ, వైరా మండల పరిషత్ కార్యాలయంలో  దాదాపు 50 నుంచి 60 మంది డేటా ఎంట్రీ వర్క్ చేసినట్లు వారు పేర్కొన్నారు.. నిరుద్యోగులమైన మేము  అంతంత ఆర్థిక పరిస్థితులతో ఉన్న మాకు మూడు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా వర్క్ కు సంబంధించిన అమౌంటు ఇవ్వలేదని.. అధికారులను ఎప్పటికప్పుడు అడుగుతున్నా రేపు మా పో అంటూ కాలం వెలదీస్తున్నారని.. వారు ఆవేదన వ్యక్తం చేశారు..

ఒక్కొక్క ఆపరేటర్కు 15వేల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉందని.. మొత్తంగా దాదాపు 8లక్షల వరకు గాను 50 మందికి రావలసి ఉందని వారు పేర్కొన్నారు.. డేటా ఎంట్రీ వర్క్ అనంతరం వెంటనే డబ్బులు ఇస్తామని చెప్పిన అధికారులు డబ్బులు ఇవ్వకుండా.. తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డేటా ఎంట్రీ తాలూకా అమౌంట్ ను వెంటనే తమకు అందించాలని వారు అధికారులు డిమాండ్ చేస్తున్నారు...ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందన్నారు. నిధులు విడుదల కాగానే వారికీ అందజేస్తామ న్నారు.