calender_icon.png 19 March, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మా భూములు మాకు ఇప్పించండి’

17-12-2024 01:12:04 AM

కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): తాతల కాలం నాడు తమకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌మెంట్ భూములను గత మూడు సంవత్సరాల క్రితం పరిశ్రమల కోసం అని అధికారులు తీసుకుని, బదులుగా స్థలం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ రైతులు తెలిపారు.

తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లింగంపల్లిలోని 6 వందల ఎకరాల భూమి పరిశ్రమ కోసం అని లాక్కున్నారని వాపోయారు. వేరే చోట స్థలం ఇస్తామని హమీ ఇచ్చి చూపించడం లేదని తెలిపారు. జీవనోపాధి కోల్పోయామని తమకు వేరే చోటనైనా స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.