calender_icon.png 28 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ కమిటీలో మాకూ అవకాశం కల్పించండి..

28-04-2025 06:47:35 PM

ఎమ్మెల్యేకు సిపిఐ నేతల వినతి...

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ కమిటీలో సిపిఐకి భాగస్వామ్యం కల్పించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) కు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అజయ్ సారధి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తమ పార్టీ నాయకుడు సుధాకర్ రెడ్డికి ఆత్మ చైర్మన్ ఇచ్చారని, ఇదే తరహాలో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో సైతం నామినేటెడ్ పదవుల్లో సిపిఐ క్యాడర్ కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పెరుగు కుమార్ రేష పల్లి నవీన్, వెంకన్న, సాంబలక్ష్మి, శేఖర్, స్వామి పాల్గొన్నారు.