calender_icon.png 11 January, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకూ అవకాశం ఇవ్వండి..

09-07-2024 01:16:06 AM

గొల్ల, కురుమలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాని సీఎం, డిప్యూటీలకు విజ్ఞప్తి

ఎమ్మెల్సీ, ఐదు కార్పోరేషన్ పదవులు కూడా ఇవ్వాలని వినతి

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): గొల్ల, కురుమలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మిగతా మంత్రులను కూడా  కలిసి విజ్ఞప్తి చేసినట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. తమ విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందిచారన్నారు. తాను కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు మనసులోని మాట బయ టపెట్టారు. నల్లగొండ  పార్లమెంట్ పరిధిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవులు దక్కాయని, భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీసీ బిడ్డనైన తనకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ  కూడా  మంత్రి వర్గంలో గొల్ల, కురుమలు లేకుండా లేరని ఐలయ్య గుర్తు చేశారు. రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవితో పాటు ఒక ఎమ్మెల్సీ, ఐదు కార్పోరేషన్ పదవులు, పార్టీ పదవుల్లో పీసీసీ లేదా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.