calender_icon.png 13 January, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపపు ప్రయత్నాన్ని విరమించుకోండి

01-12-2024 12:27:35 AM

బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ 

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనా రాహిత్యంగా వ్యవ హరిస్తున్నారని బీఆర్‌ఎస్ నేత దాసో జ్ శ్రవణ్ ఆరోపించారు. పాపపు ప్రయత్నాన్ని విరమించుకోవాలని, చరిత్ర ఆనవాళ్లతో ఆటలాడితే నిప్పు తో చెలగాటమేనని  హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయ న మీడియాతో మాట్లాడారు.

2006 లో కేసీఆర్ కేంద్రమంత్రి పదవి, ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడే తెలంగాణ తల్లి రూపంపై చాలా మందితో చర్చించారన్నారు. రాష్ట్ర ఆత్మను ప్రతిబింబిం చేలా ఉద్యమ ప్రతి రూపంగా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకులను సంతృప్తి పరిచేందుకు విగ్రహా న్ని మారుస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతల సిద్ధాంతాన్ని పాటించకుం డా ప్రధాని మోదీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడని ఆరోపించారు. మోదీ అశోక చిహ్నంలోని సింహాల హావభావాలను మారిస్తే రాహుల్ వ్యతిరేకించారని గుర్తుచేశా రు. ‘ప్రతి పల్లెలో తెలంగాణతల్లి విగ్రహాలు ఉన్నాయి.. ఎన్ని ధ్వంసం చేస్తా రో చూస్తాం’ అని అన్నా రు.

మేధావులు, కాంగ్రెస్ నేతలు రేవంత్ వికృత చేష్టలపై స్పందించాలని కోరారు. లగచర్ల భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేసినపుడు కేసులు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే బూడి ద భిక్ష మయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.