calender_icon.png 20 November, 2024 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ వర్గాల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వండి

20-11-2024 03:39:12 PM

వెనుకబడిన వర్గాల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ఈ నెల 23న బహిరంగ విచారణ

హైదరాబాద్ కలెక్టరేట్ లో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ విచారణ

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తోడ్పడునందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ ఈనెల 23న బహిరంగ విచారణ చేపట్టనున్నందున బీసీ తరగతులు చెందిన వారు సామాజిక, ఆర్థిక, విద్య రంగాలలో సలహాలు, సూచనలు బీసీ కమిషన్ కు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెంకట చారి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ కుల సంఘాలతో వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశోధించడానికి బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ నిరంజన్, కమిటీ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, బీసీ వెల్ఫేర్ కమిషనర్ సభ్య కార్యదర్శి గా గల బీసీ కమిషన్ ఈనెల 23న హైదరాబాద్ కలెక్టరేట్(లక్డికాపూల్)లో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ విచారణ చేపట్టనుందని అన్నారు.

వెనుకబడిన తరగతులకు చెందినవారు ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన సూచనలు, సలహాలు కమిషన్ కు అఫిడవిట్ రూపంలో అందించాలని సూచించారు. అఫిడవిట్ ఒరిజినల్ సెట్ ఒకటితో పాటు 5 జిరాక్స్ సెట్లను (మొత్తం 6 సెట్లు) ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. అఫిడవిట్ కు ఎవిడెన్స్, సాక్షాలు ఉంటే పటిష్టంగా  ఉంటుందన్నారు. అఫిడవిట్ స్వీకరణకు 3 కౌంటర్లు రిసెప్షన్, అప్లికేషన్ వెరిఫై, అసిస్టెన్స్ కోసం సలహాలు, మార్గదర్శనం చేసేందుకు డిప్యూటీ తాహసిల్దార్, సహాయ బీసీ సంక్షేమ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ప్రతి దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు జి.ఆశన్న, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాజ్ అహ్మద్, సహాయ బీసీ సంక్షేమ అధికారి టి.నరసింహులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.