అరబ్ దేశాలకు సూచించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, జనవరి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నా రు. పాలస్తీనా శరణార్థులను గాజా నుంచి జోర్డాన్, ఈజి ప్టు, ఇతర అరబ్ దేశాలకు తరలించాలని తాజాగా ప్రతిపాదించారు. గాజా ను ‘కూల్చివేత ప్రదేశం’గా పిలుస్తూ పాలస్తీనియన్లు శాంతిగా జీవించేందుకు వేరే చోట ఇళ్లను నిర్మించాలని సూచించారు.
శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. యుద్ధంతో దెబ్బతిన్న ప్రాంతాన్ని మళ్లీ య థా స్థితికి తెచ్చేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు చెప్పా రు. తన ప్రతిపాదనకు జోర్డా న్ రాజు అబ్దుల్లా-2 ఒప్పుకున్నారని, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సీసీతో మాట్లాడుతానని పేర్కొన్నారు.
ఇందుకు జోర్డాన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. “గాజా అనేది ప్రస్తుతం మరుభూమిగా మారింది.. దాన్ని పునర్నిర్మించాల్సి ఉంది..అందుకే అరబ్ దేశాలు పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరముంది” అని ట్రంప్ చెప్పుకొచ్చారు.