21-03-2025 12:28:23 AM
జడ్చర్ల మార్చి 20 : అర్హులకే ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు అందివ్వాలని జడ్చర్ల తాసిల్దార్ నరసింహ రావు కు పలువురు వినతి పత్రాన్ని సమర్పించారు. 27 నవంబర్ 2024 రోజున సుప్రీంకోర్టు రిజర్వేషన్ ప్రకారం. మతం మారిన వారికి రిజర్వేషన్ రద్దు అని సంచలన తీర్పునిచ్చింది.
హిందూమతంలో ఉంటూ వివక్షను ఎదుర్కొంటున్న వారికి రిజర్వేషన్లు అనే వరాన్ని. కల్పించింది. హిందూమతంలో ఉంటూ క్రిస్టియన్ గా మారిన హిందువులుగా కొనసాగుతూ. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు చేయడంలో పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ చేసి అందించాలని కోరారు. ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేసిన వారిలో ఇచ్చినవారు శ రాజీవ్, సి మహేష్, డి రాము, డి సాయికుమార్, సంజీవ, కే ప్రవీణ్, ఏ యాదయ్య తదితరులు ఉన్నారు.