calender_icon.png 28 October, 2024 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణపేటకు సైనిక్ స్కూల్ ఇవ్వండి

10-08-2024 01:41:44 AM

పార్లమెంట్‌లో డీకే అరుణ

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యంత వెనుకబ డిన ప్రాంతాల్లో ఒకటైన నారాయణపేటకు సైనిక్ స్కూల్‌ను ఇవ్వాలని శుక్రవారం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసి నా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థలం కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జిల్లాలోని ఎక్లాస్‌పూర్ వద్ద 50 ఎకరాల స్థలం సైనిక్ స్కూల్ కోసం సర్వే నిర్వహించినట్టు తెలిపారు. వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చొరవ తీసుకుని సైనిక్ స్కూల్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.