18-03-2025 01:55:24 AM
యాదాద్రి భువనగిరి మార్చి 17 (విజయక్రాంతి): ఈ బడ్జెట్ సమావేశాల్లో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలి, - మల్లన్న సాగర్ నుంచి ఒక టీఎంసీల నీళ్లు తెచ్చి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించి ఎండిపోతున్న పొలాలను కాపాడాలి, సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకుల డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి తక్షణం రూ. 500 కోట్ల రూపాయలు కేటాయించాలని, ఎండిపోతున్న పొలాలకు సాగునీరు అందించడానికి మల్లన్న సాగర్ ద్వారా ఒక టీఎంసీ నీళ్లు బస్వాపురం ప్రాజెక్టు తేవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బి.ఎస్.పి రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం స్థానిక టి.ఎన్.జి.ఓ భవన్, భువనగిరిలో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో రూ. 500 కోట్లు కేటాయించాలని కోరుతూ సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరగగా ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 మండలాలు 1.88 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే అత్యంత కీలకమైన బస్వాపురం.
ప్రాజెక్టుకు ప్రభుత్వము నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 500 కోట్ల రూపాయల కేటాయిస్తే బస్వాపురం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న తిమ్మాపురం, లప్పనాయక్ తండ, చౌకులతండ గ్రామ ప్రజలకు ఇండ్లకు, భూములకు పరిహారంతో పాటు నూతన గ్రామాల నిర్మాణం కూడా పూర్తి అవుతుందని అన్నారు.
ఈ సమావేశంలో మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, మాజీ సర్పంచ్ లు కొండ స్వామి, ఎదునూరు మల్లేశం, మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి, సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, ప్రజాసంఘాల నాయకులు కొండ అశోక్, గంధమల్ల మాతయ్య, మోటె ఎల్లయ్య, వడ్డెబోయిన వెంకటేష్, రాంపల్లి వెంకటేష్, శీలం స్వామి, నకిరేకంటి బాలయ్య, ఏ. ఐలయ్య, ఎడ్ల నారాయణరెడ్డి, వి. రాంబాబు పాల్గొన్నారు.