18-03-2025 12:00:00 AM
టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌కు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వినతి
జనగామ, మార్చి 17(విజయక్రాంతి): పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూ రు మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో డీసీ అండ్ సీపీ భవనంలో తెలంగాణ ఫైనాన్స్ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొర్రూరులో రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్త, పారిశుద్ధ్యం, స్మార్ట్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థనకు టీయూఎఫ్‌ఐ డీసీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తొర్రూరుకు నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఆయన మాటిచ్చారు.