calender_icon.png 23 December, 2024 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవోదయకు స్థలాలు ఇవ్వండి

22-12-2024 08:34:46 PM

ముఖ్యమంత్రికి ఎంపీ అరవింద్ ఫిర్యాదు విజ్ఞప్తి... 

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాలలో నవోదయ ఏర్పాటుకు స్థలాలు ఇవ్వాలని ఎంపీ అరవింద్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి అభ్యర్థించారు. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తో కలిసి రెండు జిల్లాల నవోదయ ఏర్పాటుకు 20 ఎకరాల చొప్పున భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని ఆదివారం రోజు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రెండు జిల్లాల్లో ప్రతిపాదించిన స్థలాలను సీఎం దృష్టికి  తెచ్చి ఉంచారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను మాధవ నగర్ ఆర్ఓబి 50 50 పద్ధతిన మంజూరు చేయబడిందని అడవి మామిడిపల్లి ఆర్ఓబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరైనప్పటికీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను దారి మళ్ళించిందని ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోబిల పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి త్వరగా పనులు అయ్యేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రిని ధర్మపురి అరవింద్ కోరారు. 

జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి ఓఎల్ఎస్ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ ఎంపీ అరవింద్ తో కలిసి జగిత్యాల పట్టణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. తమ విజ్ఞాపన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంపీ అరవింద్ తెలిపారు.