19-03-2025 12:53:45 AM
- సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య
- ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు వినతిపత్రం అందజేత
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 18: అనాజ్ పూర్ రైతులకు పట్టా పాసుబుక్కులివ్వాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీసు ఎదుట సీపీఎం నాయకత్వంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, అనాజ్ పూర్ రెవెన్యూ సర్వే నెంబర్ 274,275,276,277,278, 281లో 125 బడుగు బహీన వర్గాల వారికి 1991లో సీలింగ్ పట్టాలు గత ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. అనంతరం ఆర్డీవో అనంతరెడ్డి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుడూ... అనాజ్ పూర్ రైతులకు పాసుబుక్కులివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో అనాజ్‌పూర్ రైతులకు సీలింగ్ పట్టాలు ఇచ్చారన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరిద్రమైన ధరణిని తీసుకొచ్చి రైతులు మోసం చేసిందన్నారు. పాసుబుక్కులు ఇవ్వకపోగా.. ఆన్‌లైన్ నుంచి కూడా తొలగించిందన్నారు.
దీంతో రైతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి.. తిరిగి అలసిపోయారన్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు అసైన్డ్, పొరంబొకు, సీలింగ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి ...ఇంత వరకు నెరవేర్చకపోగా...పేదల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పలాని చూస్తుందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ భూములను నమ్ముకుని జీవిస్తున్న పేదలకు పట్టా పాసుబుక్కులిచ్చి.. రైతు భరోసా, రైతు బీమా అందేలా ఆదకోవాలన్నారు. లేని ఏడాల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా, మండల నాయకులు ముత్యాలు, జంగ య్య, మహేశ్వరం లింగస్వామి, రైతులు భిక్షపతి గౌడ్ మహేష్ గౌడ్, రాములు, మహేష్, యాదయ్య, రంగయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.