calender_icon.png 26 February, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిన్ని నిధులు ఇవ్వండి

26-02-2025 01:36:22 AM

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మైనార్టీల సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ని హైద్రాబాద్ సీఎం నివాసంలోఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మెగారెడ్డిలతో కలిసి రాష్ర్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల కొత్వాల్ వినతి పత్రం సమర్పించారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పలు అంశాలను సీఎం చర్చించినట్లు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తెలియజేశారు. ఇటీవల మైనార్టీల సంక్షేమానికి విడుదల చేసిన నిధులకు సంబంధించి సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.