బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): రైతు రుణమాఫీలో అన్యా యానికి గురైన రైతులకు అండగా ఉంటూ వారికి మనోధైర్యం కల్పించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఏర్పాటుచేసిన రైతు సహాయ కేంద్రంను ఆదివారం సందర్శించారు.
రుణమాఫీ కాని రైతులు పెద్ద ఎత్తున సహాయ కేంద్రానికి ఫోన్ చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని చర్య లు తీసుకుంటున్నట్లు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కిసాన్ మో ర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పాపయ్యగౌడ్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అంజయ్యయాదవ్ పాల్గొన్నారు.