- ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించిన ఘటన
- మాదాపూర్ పేస్‌హాస్పిటల్‌లో దారుణం
శేరిలింగంపల్లి, జనవరి 1: మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. లివర్ సమస్యతో బాధపడుతున్న లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60) అనే మహిళను ఆమె కుటుంబ సభ్యు సోమవారం హాస్పిటల్‌లో చేర్చారు. ఆ సమయంలో 2.20 లక్షలు చెల్లించారు. మంగళవారం ఉదయం ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని జనవరి 1న డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేయకుండా ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని, మరో 3 లక్షలు చెల్లించాలని పేస్ హాస్పిటల్ సిబ్బంది హుకూం జారీ చేశారు. ఆ డబ్బును డిపాజిట్ చేసేందుకు వెళ్లగా ఎల్లమ్మ చనిపోయిందని హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఎల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ సిబ్బంది మాత్రం డబ్బు కట్టే వరకు బాడీ ఇవ్వమని చెప్పారు.